వణికిపోయే చలిలో ఐష్‌ ఆ చీర కట్టుకుని..

ప్రముఖ బాలీవుడ్ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ కలిసి నటించిన సినిమా ‘మొహబ్బతే’. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్‌ చోప్రా నిర్మించారు. 2000 అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మంచి టాక్‌తోపాటు వసూళ్లు అందుకుంది.....

Updated : 30 Oct 2020 11:59 IST

అయినా సరే ఫిర్యాదు చేయలేదు..

ముంబయి: ప్రముఖ బాలీవుడ్ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ కలిసి నటించిన సినిమా ‘మొహబ్బతే’. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్‌ చోప్రా నిర్మించారు. 2000 అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మంచి టాక్‌తోపాటు వసూళ్లు అందుకుంది. అప్పట్లో రూ.19 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.90 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఇందులో అమితాబ్‌ కుమార్తె, షారుక్‌ ప్రేయసి ‘మేఘా’గా ఐశ్వర్య నటించారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. చిత్రంలోని ‘హమ్‌కో హమీసే..’ పాట షూటింగ్‌ సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ పాట కోసం చల్లటి మంచు ప్రదేశంలో ఐశ్వర్య పలుచటి (లేస్‌) చీర కట్టుకున్నారని ఫరా చెప్పారు.

‘ఐష్‌కు వృత్తిపట్ల ఎంతో నిబద్ధత ఉంది. లండన్‌లో చలికి వణికిపోతున్న సమయంలో పాట కోసం లేస్‌ సారీ కట్టుకుని తడిసిపోయింది. అయినా సరే నాకు ఇబ్బందిగా ఉందని ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. ఈ చిత్రంలో ఆమెకు, షారుక్‌కు మధ్య కెమెస్ట్రీ అద్భుతం. ‘ఏక్‌ లడ్కీ థి దివానీ సీ..’ కవిత అంత పాపులర్‌ కావడానికి వారి నటనే కారణం. లండన్‌లో రాత్రి వేళలో వర్షం పడుతుండగా షూటింగ్‌ చేశాం. ఆపై స్విస్‌కు వెళ్లి రెండు పాటల్ని తీశాం. ఈ సినిమాలో ‘హమ్‌కో హమీసే..’ పాట నాకెంతో ఇష్టం. నిజంగా చాలా అందంగా ఆ పాట తెరకెక్కింది’ అని చెప్పారు. ‘మొహబ్బతే’లో అనుపమ్‌ ఖేర్‌, ఉదయ్ చోప్రా, షమితా శెట్టి, కిమ్ శర్మ, అర్చన పురాణ్‌ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని