Anand Devarakonda: ‘హైవే’లో ఏం జరిగింది?

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా కేవీ గుహన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హైవే’. వెంకట్‌ తలారి నిర్మిస్తున్నారు. మానస రాధాకృష్ణన్‌ కథానాయిక. సయామీ ఖేర్‌, అభిషేక్‌ బెనర్జీ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఆనంద్‌ దేవరకొండ పుట్టినరోజు

Updated : 16 Mar 2022 13:36 IST

ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా కేవీ గుహన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హైవే’. వెంకట్‌ తలారి నిర్మిస్తున్నారు. మానస రాధాకృష్ణన్‌ కథానాయిక. సయామీ ఖేర్‌, అభిషేక్‌ బెనర్జీ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఆనంద్‌ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన కొత్త లుక్‌ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఆనంద్‌ ఓ కొండరాయిపై కూర్చొని చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు. ‘‘విభిన్నమైన సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఆనంద్‌ కెరీర్‌లో మరో కొత్త తరహా సినిమా అవుతుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సైమన్‌ కె.కింగ్‌ స్వరాలందిస్తున్నారు. ‘బేబీ’, ‘గం.. గం.. గణేశా’ చిత్ర బృందాలు సైతం కొత్త ప్రచార చిత్రాలు విడుదల చేసి.. ఆనంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాయి. ఆయన హీరోగా నటిస్తున్న ఈ రెండు సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని