నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి: చిరు

నటుడు రాజశేఖర్‌ త్వరితగతిన కొవిడ్‌ నుంచి కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. రాజశేఖర్‌ ఆరోగ్యం గురించి శివాత్మిక పెట్టిన ట్వీట్‌పై చిరు స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా రాజశేఖర్‌ కుటుంబానికి ధైర్యం చెబుతూ ట్వీట్‌ చేశారు. ‘శివాత్మిక.. నువ్వు ఎంతగానో ప్రేమించే నీ తండ్రి...

Updated : 22 Oct 2020 20:03 IST

రాజశేఖర్‌ ఆరోగ్యం గురించి చిరంజీవి ట్వీట్‌

హైదరాబాద్‌: నటుడు రాజశేఖర్‌ కొవిడ్‌ నుంచి వేగంగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. రాజశేఖర్‌ ఆరోగ్యంపై శివాత్మిక చేసిన ట్వీట్‌పై చిరు స్పందించారు. ఈ మేరకు ఆయన రాజశేఖర్‌ కుటుంబానికి ధైర్యం చెబుతూ ట్వీట్‌ చేశారు. ‘శివాత్మిక.. నువ్వు ఎంతగానో ప్రేమించే నీ తండ్రి, నా సహనటుడు, స్నేహితుడు రాజశేఖర్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థనలు ఆయనతోపాటు ఆయన కుటుంబంలో ధైర్యం నింపాలి’ అని చిరు ట్వీట్‌ చేశారు.

తన కుటుంబమంతా కొవిడ్‌-19 బారిన పడిందని ఇటీవల రాజశేఖర్‌ సోషల్‌మీడియా వేదికగా తెలియజేశారు. ఈ తరుణంలోనే తాజాగా రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మిక.. ఆయన ఆరోగ్యంపై పలు ట్వీట్లు చేశారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరు వదంతులు వ్యాప్తిచేయవద్దని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా రాజశేఖర్‌ ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని