మరోసారి వ్యాఖ్యాతగా తారక్‌..?

వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. కొన్ని సంవత్సరాల క్రితం ఓ రియాల్టీ షో కోసం వ్యాఖ్యాతగా మారి బుల్లితెర అభిమానులను పలకరించారు. ఆ షోలో ఆయన తన డైలాగులు, పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు....

Updated : 12 Dec 2020 16:28 IST

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన యంగ్‌టైగర్‌

హైదరాబాద్‌: వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. గతంలో ఓ రియాల్టీ షో కోసం వ్యాఖ్యాతగా మారి బుల్లితెర అభిమానులను అలరించారు. ఆ షోలో డైలాగులు, పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో ప్రసారం కానున్న ఓ రియాల్టీ షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని చిత్రపరిశ్రమలో టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ రియాల్టీ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్‌ వేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు విని తారక్‌ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ అభిమాన నటుడ్ని మరోసారి బుల్లితెరపై చూడడం కోసం తాము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు.

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమురం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ మహాబలేశ్వర్‌లో జరిగింది. ఇందులో తారక్‌-చెర్రీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత తారక్‌.. త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు.

ఇవీ చదవండి

ఫొటోగ్రాఫర్‌ను ఆటపట్టించిన ఎన్టీఆర్‌

సీత వచ్చేసింది.. క్లైమాక్స్‌ మొదలైంది..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని