మహేశ్ ఫొటోలు జూమ్ చేసి చూస్తా: నటి
నాలుగు పదుల వయసులోనూ యంగ్ లుక్‌లో కనిపిస్తూ.. తన అందంతో ప్రతి ఒక్కరి హృదయాలను కొల్లగొడుతుంటారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. లుక్స్‌పరంగా కొంతమంది నెటిజన్లు ఆయన్ని మిల్కీబాయ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు కూడా....
సూపర్‌స్టార్ అందానికి సాయిపల్లవి ఫిదా
హైదరాబాద్: నాలుగు పదుల వయసులోనూ యంగ్ లుక్‌లో కనిపిస్తూ.. తన అందంతో ప్రతి ఒక్కరి హృదయాలను కొల్లగొడుతుంటారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. లుక్స్‌పరంగా కొంతమంది నెటిజన్లు ఆయన్ని మిల్కీబాయ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు కూడా. అయితే, మహేశ్ అందానికి కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా మనసుపారేసుకున్నారు. తాజాగా నటి సాయిపల్లవి సైతం మహేశ్‌కి ఫిదా అయినవారి జాబితాలోకి చేరారు.
మహేశ్ అందంగా ఉంటారని.. ఆయన ఫొటోలు చూసి ఫిదా అవుతుంటానని ఆమె తెలిపారు. ‘మహేశ్‌బాబు ఎంతో అందంగా ఉంటాడు. ఏ సమయంలోనైనా ఆయన స్కిన్ మెరిసిపోతుంటుంది. కొన్నిసార్లు మహేశ్ ఫొటోలు చూసి... లుక్స్‌పరంగా ఒక వ్యక్తి ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఉంటాడు? అనుకుని ఆశ్చర్యానికి లోనయ్యేదాన్ని. ముఖ్యంగా చెప్పాలంటే, చాలావరకూ నేను ఆయన ఫొటోల్ని జూమ్ ఇన్‌లో చూసి.. ఆయన ముఖంపై ఒక్కమచ్చ కూడా లేదని, ఎంతో బాగున్నారని అనుకుంటాను’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘పడిపడి లేచె మనసు’ తర్వాత సాయిపల్లవి తెలుగులో నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య కథానాయకుడు. ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే, ఆమె రానాతో కలిసి ‘విరాటపర్వం’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు, ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్ ‘సర్కారు వారిపాట’కు సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి
మెగా కాంపౌండ్‌లో మరో పెళ్లి..?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలుగు దర్శకుల.. బాలీవుడ్ దండయాత్ర
పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్.. టాలీవుడ్ అనే హద్దులు క్రమంగా తెరమరుగవుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయొచ్చన్న ధీమా.. -
సలార్ 2 ఈ నెలాఖరు నుంచే
ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో ప్రయాణం చేయడంలో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేళ్లుగా ఆయన ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. -
కరీనా స్థానంలో నయన్?
‘కేజీఎఫ్’ విజయాల తర్వాత యశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సన్నీ.. తులసీల ప్రేమ కథ
‘బవాల్’ తర్వాత వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ మళ్లీ జోడిగా నటిస్తున్న చిత్రం ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీని శశాంక్ ఖైతాన్ తెరకెక్కిస్తున్నారు. -
కోల్పోయిన అవకాశం తిరిగొచ్చింది
‘ఎవరి సినిమాలోనైతే నటించే అవకాశం కోల్పోయానో.. ఇప్పుడు ఆయన చిత్రంలోనే భాగమయ్యే అవకాశం లభించడం నా అదృష్టం’ అంటోంది ప్రగ్యా జైస్వాల్. -
మనసుల్ని హత్తుకునే.. రాజు యాదవ్
‘‘నవ్విస్తూనే... మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పంచుతుంది ‘రాజుయాదవ్’. ఇలాంటి ఓ మంచి సినిమాని అందరూ ప్రోత్సహించాలి’’ అన్నారు తేజ సజ్జా. -
ధ్రువ్ విక్రమ్.. కబడ్డీ ఆటగాడిగా
విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ తాజాగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్ విక్రమ్ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి