వెండితెరపై ‘నాట్యం’ ఆరోజే

ఓ కథను నృత్యం ద్వారా అందమైన రూపంలో చెప్పడమే ‘నాట్యం’. ఇప్పుడిదే పేరుతో ఓ కథను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు.

Updated : 19 Sep 2021 07:28 IST

కథను నృత్యం ద్వారా అందమైన రూపంలో చెప్పడమే ‘నాట్యం’. ఇప్పుడిదే పేరుతో ఓ కథను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని రేవంత్‌ కోరుకొండ తెరకెక్కిస్తున్నారు. కమల్‌ కామరాజ్‌, శుభలేఖ సుధాకర్‌, భానుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబరు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ‘‘నాట్య ప్రధానంగా సాగే చిత్రమిది. ఇటీవల బాలకృష్ణ విడుదల చేసిన తొలి పాట ‘నమఃశివాయ’కు మంచి స్పందన     లభించింది’’ అని దర్శక నిర్మాతలు తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని