అందుకే.. ‘సంజూ’ను ఆమిర్‌ఖాన్ తిరస్కరించాడు
బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్టర్, కాంట్రవర్సీ కింగ్‌గా పేరున్న సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజూ’ విడుదలై నేటికి మూడేళ్లు. సంజయ్‌దత్ జీవిత కథలాగే ఈ సినిమా పాత్రల ఎంపికలోనూ అన్నీ ట్విస్టులే చోటు చేసుకున్నాయి. ఈ చిత్రంలో సంజయ్‌దత్‌గా యువ నటుడు రణ్‌బీర్‌కపూర్ కనిపించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్టర్, కాంట్రవర్సీ కింగ్‌గా పేరున్న సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజూ’ విడుదలై నేటికి మూడేళ్లు. సంజయ్ దత్ జీవిత కథలాగే ఈ సినిమా పాత్రల ఎంపికలోనూ అన్నీ ట్విస్టులే చోటు చేసుకున్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్‌గా యువ నటుడు రణ్‌బీర్‌కపూర్ కనిపించిన విషయం తెలిసిందే. సంజూ తండ్రి సునీల్‌దత్ పాత్రలో ఆమిర్‌ఖాన్ నటించాల్సింది. ఇందుకోసం డైరెక్టర్ ఈ మిస్టర్ పర్ఫెక్ట్‌ను సంప్రదించారు. కాగా.. ఆమిర్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. అయితే.. దానికి గల కారణాలను ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
‘‘నిజానికి సంజయ్‌దత్ పాత్ర నాకు చాలా నచ్చింది. నా హృదయాన్ని గెలుచుకున్న పాత్ర అది. ఆ సినిమాలో సంజయ్‌దత్ పాత్ర తప్పితే వేరే ఏ పాత్రనూ నేను పోషించలేను. అయితే.. ఆ పాత్ర అప్పటికే రణ్‌బీర్‌కపూర్ చేస్తున్నాడు. కాబట్టి నేను మధ్యలో కలుగజేసుకోదలచుకోలేదు’’ అని ఆమిర్‌ఖాన్ అన్నాడు. ఇదిలా ఉండగా.. ఆ సినిమా డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి మరోలా స్పందించాడు. తనకంటే వయసులో పెద్దవారన్న కారణంతోనే సునీల్‌దత్ పాత్ర పోషించేందుకు ఆమిర్‌ఖాన్ ఒప్పుకోలేదని పేర్కొన్నాడు. ఆమిర్‌ఖాన్‌కు కథ చెప్పేందుకు వెళ్లినప్పుడు ఆయనను పాత్ర పోషించమని అడగాలనే ఉద్దేశం తనకు లేదని హిరాణి అన్నాడు. సునీల్‌దత్ పాత్రలో నటించాలని అనుకోకుండా అడగాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నాడు. దాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆమిర్ ఆ ఆఫర్‌ను వెంటనే తిరస్కరించాడని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి ఈ సినిమాలో సంజయ్‌దత్‌గా రణ్‌బీర్‌కపూర్, సునీల్ దత్‌గా పరేశ్‌రావల్ కనిపించారు. ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే.. సంజూపాత్ర కోసం మొదటగా అనుకున్నది రణ్‌బీర్‌కపూర్‌ను కాదట. మొదట రణ్‌వీర్‌సింగ్‌తో సినిమా చేద్దామని నిర్మాత విధు వినోద్ నిర్ణయించారు. అయితే.. రణ్‌బీర్‌కపూర్ అయితేనే సంజూ పాత్రలో బాగా సరిపోతాడని డైరెక్టర్ రాజ్‌కుమార్ ఒప్పించడంతో మొత్తానికి సంజూభాయ్‌గా రణ్‌బీర్ తెరపైకి వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా 5,500 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఉత్తమ చిత్రంగా పలు అవార్డులు సొంతం చేసుకుంది. సంజయ్ దత్ పాత్ర పోషించిన రణ్‌బీర్‌కపూర్‌కు ఉత్తమ నటుడిగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ నుంచి అవార్డు లభించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sunil Gavaskar: ఆ విషయంలో అతడు ధోనీని గుర్తు చేస్తాడు : హార్దిక్ పాండ్యపై గావస్కర్ ప్రశంసలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!