Abhiram: రానా సోదరుడు అభిరామ్‌ కొత్త చిత్రం టైటిల్‌ ఇదే!

ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు, నటుడు రానా సోదరుడు అభిరామ్‌ దగ్గుబాటి వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే.

Published : 22 Feb 2022 13:02 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు తనయుడు, నటుడు రానా సోదరుడు అభిరామ్‌ దగ్గుబాటి వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. మంగళవారం తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు, ప్రీలుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘అహింస’ అనే పేరు పెట్టారు. ‘అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తధైవచ’ అంటూ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రీలుక్‌ను విడుదల చేసింది. ముఖానికి గోనె సంచి కట్టి ఉండగా, రక్తమోడుతూ అభిరామ్‌ కనిపించాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘అహింస’కి ఆర్పీ పట్నాయక్‌ సంగీత దర్శకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని