Allu Arjun: మీ వల్లే నేనీ స్థాయిలో ఉన్నా: అల్లు అర్జున్‌

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌.

Published : 08 Apr 2022 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన, ప్రోత్సాహమిచ్చిన వారందరికీ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌. ఈ మేరకు ఓ లేఖను పోస్ట్‌ చేశారు. ‘‘నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమ వారు, సినీ ప్రేక్షకులు, అభిమానులందరి ప్రేమ, ఆశీస్సుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. 40 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ఏదో తెలియని ఫీలింగ్‌. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు.

1982 ఏప్రిల్‌ 8న జన్మించిన అర్జున్‌ ‘విజేత’, ‘స్వాతిముత్యం’ చిత్రాల్లో బాల నటుడిగా అలరించి ‘గంగోత్రి’తో హీరోగా మారారు. ‘ఆర్య’తో మంచి గుర్తింపు పొందారు. ‘బన్నీ’, ‘హ్యాపీ’, ‘దేశముదురు’, ‘వేదం’, ‘జులాయి’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’ తదితర సినిమాలతో విశేష క్రేజ్‌ సంపాదించారు. ‘పుష్ప: ది రైజ్‌’తో పాన్‌ ఇండియా హీరోగా అవతరించారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబరులో విడుదలై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. అర్జున్‌ ఈ సినిమా సీక్వెల్‌ ‘పుష్ప: ది రూల్‌’ పనుల్లో ఉన్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని