Pawankalyan: ‘జాని’ నాకెంత నచ్చిందో చెప్పాలనుకున్నా.. కానీ: ప్రియదర్శి

కమెడియన్‌, సహాయనటుడు, హీరోగా మంచి సక్సెస్‌ సొంతం చేసుకున్నారు నటుడు ప్రియదర్శి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న ఆయన తాజాగా తన అభిమాన...

Published : 08 May 2022 02:09 IST

హైదరాబాద్‌: కమెడియన్‌, సహాయనటుడిగానే కాకుండా.. హీరోగానూ మంచి సక్సెస్‌ సొంతం చేసుకున్నారు నటుడు ప్రియదర్శి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న ఆయన తాజాగా తన అభిమాన నటుడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ని కలిశారు. ఆయన ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రియదర్శి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ పవనంటే తనకెంత ఇష్టమో రాసుకొచ్చారు. ‘‘ఎప్పటి మాదిరిగానే సారధి స్టూడియోలో షూటింగ్‌కి వెళ్లాను. కానీ, ఆరోజు మాత్రం ఎప్పటిలాగా లేదు. ఎటుచూసినా హడావుడి, అందరి కళ్లలో ఆనందం, అందరి నోట ఒకే మాట.. పవన్‌కల్యాణ్‌ వస్తున్నారని. అంతే, పవన్‌ని ఒక్కసారి కలిసి మాట్లాడి, ఆయన తీసిన ‘జాని’ నాకెంత ఇష్టమో చెప్పడానికి రోజంతా ఎదురుచూశా. కానీ కుదరలేదు. ఇప్పుడు హరీశ్‌ శంకర్‌ అన్న వల్ల నా కోరిక తీరింది. పవన్‌ని కలిసి మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభూతి’’ అని ప్రియదర్శి చెప్పారు. వెంటనే హరీశ్‌ శంకర్‌ దీనిపై స్పందించారు. ‘‘కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ నువ్వు ఇలానే సాధారణంగా ఉండటం నీ విధేయతను తెలియజేస్తోంది. పవన్‌ అంటే మనందరికీ ఉన్న అభిమానం వల్ల ఇప్పుడు నువ్వు ఎంతలా భావోద్వేగానికి గురవుతున్నావో నాకు అర్థమవుతోంది’’ అని హరీశ్‌ రిప్లై ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని