సీనియర్‌ నటి కవిత ఇంట్లో విషాదం

కరోనా సెకండ్‌ వేవ్‌ సినిమా ఇండస్ట్రీని ఇంకా పీడిస్తూనే ఉంది. ఉద్ధృతి తగ్గినా అది చేసిన గాయాలు ఇంకా మానలేనేదు. ఇదిలా ఉండగా.. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 17 Jun 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా సెకండ్‌ వేవ్‌ సినిమా ఇండస్ట్రీని ఇంకా పీడిస్తూనే ఉంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. మరోవైపు ఆమె భర్త సైతం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత.. తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నారు. ఆమె కుమారుడి మృతిపై ఆయా చిత్రపరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని