Akshay Kumar: ‘హౌస్‌ఫుల్‌’ నవ్వులు ఐదు రెట్లు

బాలీవుడ్‌లో ఎంతో ప్రేక్షకాదరణను సంపాదించుకున్నాయి ‘హౌస్‌ఫుల్‌’ ఫ్రాంచైజీ చిత్రాలు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్‌’ చిత్రపరిశ్రమలోనే నాలుగు భాగాలను రూపొందించిన మొట్టమొదటి ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకుంది.

Updated : 01 Jul 2023 07:34 IST

బాలీవుడ్‌లో ఎంతో ప్రేక్షకాదరణను సంపాదించుకున్నాయి ‘హౌస్‌ఫుల్‌’ ఫ్రాంచైజీ చిత్రాలు. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్‌’ చిత్రపరిశ్రమలోనే నాలుగు భాగాలను రూపొందించిన మొట్టమొదటి ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకుంది. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మించిన ‘హౌస్‌ఫుల్‌ 2’, ‘హౌస్‌ఫుల్‌ 3’ ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రాలు వరసగా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబట్టి విజయాల్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాలలో బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రను పోషించారు. ఇప్పుడు సినీప్రియులందరినీ మరోసారి వారి కామెడీతో అలరించడానికి ‘హౌస్‌ఫుల్‌’ దాని తదుపరి విడతతో రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రబృందం ‘హౌస్‌ఫుల్‌ 5’ (Housefull5)ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు అక్షయ్‌ కుమార్‌. ‘వాటి కన్నా ఐదు రెట్ల వినోదం కోసం సిద్ధంగా ఉండండి. తరుణ్‌ మన్సుఖాని తెరకెక్కిస్తున్న హౌస్‌ఫుల్‌ 5’ ని మీకు అందిస్తున్నాము. 2024లో దీపావళికి మరింత వినోదంతో సినిమాలో కలుద్దాం’ అని వ్యాఖ్యల్ని జోడించారు. 600సంవత్సరాల తరవాత మళ్లీ జన్మించిన ముగ్గురు జంటల కథల నేపథ్యంలో ఫర్హాద్‌ సామ్జీ తెరకెక్కించిన ‘హౌస్‌ఫుల్‌ 4’ ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఇప్పుడు ఎలాంటి భిన్నమైన కథతో హౌస్‌ఫుల్‌ అభిమానులను అలరించనున్నారో చూడాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని