Alia Bhatt: పాపకు జన్మనిచ్చిన అలియాభట్‌.. ఆనందంలో కపూర్‌ ఫ్యామిలీ

బాలీవుడ్‌ సెలబ్రిటీ జోడీ అలియాభట్ (AliaBhatt)‌, రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తల్లిదండ్రులయ్యారు.

Updated : 06 Nov 2022 13:42 IST

ముంబయి: బాలీవుడ్‌ సెలబ్రిటీ జోడీ అలియాభట్ (AliaBhatt)‌, రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తల్లిదండ్రులయ్యారు. ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు అలియా జన్మనిచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఈ శుభవార్తతో కపూర్‌ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. అలియాని చూసేందుకు కపూర్‌ కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు ఈ జంటకు అభినందనలు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న రణ్‌బీర్‌ - అలియా ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహబంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని