పూరి నాకు గర్ల్‌ఫ్రెండ్ లాంటోడు!
ఈ నటీమణుల ప్రతిభకు వెండితెర, బుల్లితెర అనే తేడా లేదు. రెండు దశాబ్దాలుగా మనల్ని అలరిస్తూ ప్రతి తెలుగింటితో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ప్రతిభావంతులుగా గుర్తుండిపోయారు. అభిమానుల హృదయాల్లో.......
ఈ నటీమణుల ప్రతిభకు వెండితెర, బుల్లితెర అనే తేడా లేదు. రెండు దశాబ్దాలుగా మనల్ని అలరిస్తూ ప్రతి తెలుగింటితో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ప్రతిభావంతులుగా గుర్తుండిపోయారు. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సహజ నటీమణులు శ్రుతి, ప్రీతి నిగమ్. వారిద్దరూ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్న విశేషాలు మీకోసం..
ప్రీతి, శ్రుతి ఎలా కలుసుకున్నారు?
శ్రుతి: ముప్పై ఏళ్ల కింద నారాయణగూడలో ఒకరికొకరం పరిచయమయ్యాం. అప్పటినుంచి మా అనుబంధం కొనసాగుతూ వస్తోంది.
ఇన్నేళ్లలో మీ మధ్య ఎవరూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయలేదా?
శ్రుతి: నేను తన ప్రైవసీకి గౌరవమిస్తాను. తను కూడా అంతే. అందుకే మా మధ్య ఎలాంటి గొడవలు రాలేదు. మా గురించి ఎవరేం మాట్లాడినా, ఏం చేయాలనుకున్నా మమ్మల్ని విడగొట్టడం సాధ్యపడలేదు.
తెర వెనుక కూడా మీలో నెగటివ్ షేడ్ ఉంటుందంట కదా? పెళ్లైన కొత్తలో మీ ఆయన మీద చూపించారంట?
ప్రీతి నిగమ్: అది అనుభవించాల్సిన వాళ్లు చెప్పాలి. పెళ్లైన కొత్తలో మాత్రం మా ఆయన ఏదో అన్నారని బెడ్ మీద నుంచి కిందపడేశాను.
మధు ఎలా కలిశారు?
శ్రుతి: ‘రుతురాగాలు’ సీరియల్లో నాతో కలిసి పనిచేశారు. మా మధ్య ఎలాంటి భావన లేదప్పుడు. కొన్నాళ్లకు ఆయనే అమ్మతో మాట్లాడారు. పెళ్లి ప్రపోజల్ పెట్టారు. వారం రోజుల సమయం తీసుకొని చేసుకుంటానని చెప్పేశాను. నేనేదైనా చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటాను.
మిమ్మల్ని చూడాలంటే పిల్లలు కారు వెనక దాక్కుని చూసేవారంట కదా?
శ్రుతి: సీరియల్ షూటింగ్ చేస్తున్న సమయంలో కారు వెనక, వాళ్ల అమ్మ కొంగు వెనక దాక్కొని కొందరు పిల్లలు భయపడుతూ చూసేవారు. సీరియళ్ల ప్రభావం అంతలా ఉండేది.
సాధారణంగా ప్రీతిని చూస్తే అలా భయపడాలి కదా?
ప్రీతి నిగమ్: నాకూ ఉన్నాయి అలాంటి అనుభవాలు. ఓ రోజు షూటింగ్ లొకేషన్లో ఫోన్ మాట్లాడుతుంటే నన్ను చూసి ‘యశోదర రా..!’అని అరుస్తూ పారిపోయారు పిల్లలు.
శ్రుతి: తెరమీద భయపెట్టే వారు నిజజీవితంలో సున్నితంగా ఉంటారండీ..!
మీ ప్రేమకథలో శ్రుతి పాత్ర ఏంటి?
ప్రీతి నిగమ్: మేమిద్దరం సన్నిహితంగా ఉండేవాళ్లం. నగేశ్, నేను కలవడంలో శ్రుతిదే కీలకపాత్ర. నా స్నేహితురాలై ఉండి తనవైపు నుంచి పైరవీలు చేసింది.
శ్రుతి: నగేశ్ ఒకసారి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ చెబుతూ మా సహాయం కోరారు. అలా కొన్ని రోజులు అయ్యాక నన్ను పక్కకు పిలిచి.. తను ప్రేమించేది ప్రీతినే అని బాంబు పేల్చాడు. ఆ తర్వాత ప్రీతిని ఒప్పించాల్సి వచ్చింది. మధు, నగేశ్ ఇద్దరూ ‘రుతురాగాలు’లో నటించినవారే.
గొడవ పడితే భార్యభర్తలిద్దరూ సైలెంట్‌గా ఉంటారంట? అదెలా సద్దుమణుగుతుంది మరి?
శ్రుతి: ఏదైనా గొడవ జరిగితే ఆయన నేరుగా కిచెన్‌లోకి వెళ్లిపోతారు. మొత్తం గిన్నెలన్నీ కడిగేస్తారు. ఇల్లంతా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత కిచెన్‌లో కనిపించే ప్రతీదాన్నీ తీసుకొని రకరకాల వంటలు చేస్తారు. నేను మాత్రం ఫోన్ చూస్తూ నిశ్శబ్దంగా ఉంటాను.
ఆ రోజుల్లో సావిత్రి ఏడిస్తే ఒక కన్ను నుంచి కన్నీటి బొట్లు కారుతాయని చూశాం. శ్రుతి ఒక కంటి నుంచే నీళ్లు తెప్పిస్తుందని ఒక ప్రముఖ హీరో నాతో చెప్పాడు.. నిజమేనా?
శ్రుతి: నిజమే సర్.
ఆ మాట అన్నది మరెవరో కాదు సాయికుమార్
శ్రుతి: ఇంత పెద్ద ప్రశంస సాయికుమార్ లాంటి అద్భుత నటుడి నుంచి రావడం నిజంగా అదృష్టం.
తెలుగు రాక, డైలాగ్ డైలాగ్‌కి మధ్య ప్రీతి గ్యాప్ ఇచ్చేవారంట?
శ్రుతి: ప్రాప్టింగ్ తీసుకుంటూ ఒక్కోసారి అలా మధ్యలో ఆగిపోయేది. కానీ తను డైలాగ్ వింటున్నట్టు, గ్యాప్ ఇస్తున్నట్లు అనుమానం రాకుండా హావభావాలతో కట్టిపడేస్తుంది ప్రీతి.
ఈ విషయంలోనే మీకు 30 అడుగుల ఫొటో పెట్టారంట?
ప్రీతి నిగమ్: మీరు ఇది చెబుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. లండన్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో అంత పెద్ద ఫొటో పెట్టారు. ఆ ఫొటో చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు.
ఇంత పెద్ద స్టార్ అయి ఉండి, ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత కూడా కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెత్తారంట?
ప్రీతి నిగమ్: ఓ సారి పరిగెత్తాను. మా పాప అదితి 8 నెలల వయసులో ఉన్నప్పుడు జరిగింది. ఉదయం 4 గంటల సమయం.. పాప ఒళ్లు కాలిపోతోంది. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఆయన కారు తీసినా కూడా చెప్పులు లేకుండా ఆసుపత్రికి పరిగెత్తాను. ఊహించలేని టెన్షన్ అది. ఈ ఘటన జరిగి ఇరవై ఏళ్లవుతుంది. ఎప్పుడు గుర్తొచ్చినా భావోద్వేగానికి గురవుతాను. ఎంత పేరు, డబ్బు ఉంటే ఏంటి? ఆ క్షణంలో బిడ్డ ఆరోగ్యం తప్ప ఇంకేది ముఖ్యమనిపించలేదు. చికిత్స పూర్తయ్యే వరకు చెప్పులు లేకుండానే ఉన్నాను.
‘అందరూ నాకు ఫ్యాన్స్ అయితే, నేను శ్రుతి ఫ్యాన్’ అని ప్రశంసించిన నటుడు ఎవరు?
శ్రుతి: బ్రహ్మానందం గారు. ‘కెమెరామెన్ గంగ’తో రాంబాబు షూటింగ్లో ఈ మాట అన్నారు. ‘మొగలిరేకులు’ రోజూ చూస్తానని, బాగా నటిస్తావని ప్రశంసించారు. అలాగే ‘అందరూ నా ఫ్యాన్స్ అయితే.. నేను శ్రుతి ఫ్యాన్’ అని అందరి ముందు చెప్పారు.
శ్రుతి హీరోయిన్గా చేసిన ఓ డైరెక్టర్ ఇప్పుడు టాప్ డైరెక్టర్ తెలుసా?
శ్రుతి: పూరి జగన్నాథ్. చిన్నప్పుడు నేను హీరోయిన్గా చేస్తే పూరి డైరెక్ట్ చేసేవాడు. ముప్పై ఏళ్లుగా మా స్నేహం అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉంటాడు. డబ్బు, ఫేమ్ వచ్చినా ఏమీ మారలేదు. తనతో ఏ విషయాన్నైనా పంచుకోగలను. పూరి నాకు గర్ల్ఫ్రెండ్లాంటోడు. తనని బాబు మొషాయ్ అని పిలుస్తుంటాను.
మీరు అద్భుతమైన నటులు కదా? సినిమాల్లో చేయకపోడానికి కారణమేంటి?
శ్రుతి: బుల్లితెరలో మనం క్వీన్‌లాగా వెలుగుతున్నప్పుడు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేయడం ఎందుకనిపిస్తుంది. సీరియల్స్‌లో మన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాసుకుంటారు. సినిమాలు చేయకూడదని కాదు.. కానీ మనకంటూ ఒక రెండు సీన్లైనా దమ్మున్నవి ఉంటే చేయాలనిపిస్తుంది. చేసే పాత్రలకు ఇంపార్టెన్స్ ఉండాలి కదా!
డబ్బింగ్ కూడా చెప్పారు కదా?
శ్రుతి: అవును. ప్రీతికి కూడా డబ్బింగ్ చెప్పాను.
మీరు డబ్బింగ్ చెప్పాలంటే లైట్స్ అన్ని ఆపేయాలని అడిగేవారంట కదా?
శ్రుతి: సిల్క్ స్మిత గారికి డబ్బింగ్ చెప్పినప్పుడు జరిగిందది. నేను కూడా ఒక నటినే కాబట్టి. సిల్క్ స్మితకు డబ్బింగ్ చెప్పాల్సినప్పుడు హావభావాలు కూడా మొహంలో పలికేవి. అక్కడే చిత్రబృందం ఉండటంతో డబ్బింగ్ చేయడం ఇబ్బందిగా అనిపించేది. అందుకే లైట్లు అన్ని ఆపేయమని అడిగేదాన్ని.
పెద్దవంశీ నల్లచీర ఫొటో కథేంటీ?
ప్రీతి నిగమ్: ‘లేడీ డిటెక్టివ్’ అనే సీరియల్ చేస్తున్నాం. దానికి ఆయనే దర్శకుడు. వంశీ గారికి నల్లచీరంటే ఇష్టం. సూర్యాస్తమయం అవుతుంటే పాత బంగ్లా మీదకి తీసుకెళ్లి మంచి ఫొటో తీశారు. మూడు రోజుల తర్వాత ఆ ఫొటోనే కానుకగా ఇచ్చారాయన.
హోలీ పండగ సమయంలో వెనక్కి నడిచారంట? ఏంటా కథ?
ప్రీతి నిగమ్: పెళ్లికి ముందు జరిగిన ఘటన ఇది. ఆ రోజు వేరొకరి మీద ప్రయోగం చేయబోయే ఇలా తేడా కొట్టింది. ఆ పానీయం తీసుకున్నాక శ్రుతి వెనక్కి నడవడంతో అక్కడ ఫన్ జెనరేట్ అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్‌తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్‌ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్‌నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652