Pushpaka Vimanam: పుష్పక విమానం ట్రైలర్‌.. ఆనంద్‌ దేవరకొండకు భార్య కష్టాలు..!

ఆనంద్‌ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ ట్రైలర్‌ను అల్లు అర్జున్‌(Allu arjun) విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. 

Updated : 30 Oct 2021 18:46 IST

హైదరాబాద్‌: ఆనంద్‌ దేవరకొండ(Anand Deverakonda)కథానాయకుడిగా దామోదర తెరకెక్కించిన చిత్రం ‘పుష్పక విమానం’(Pushpaka Vimanam). గోవర్ధన్‌ రావు దేవరకొండ, విజయ్‌ మట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. విజయ్‌ దేవరకొండ సమర్పిస్తున్నారు. శాన్వి మేఘన కథానాయిక. ఈ సినిమా నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అల్లు అర్జున్‌(Allu arjun) విడుదల చేసి, శుభాకాంక్షలు తెలిపారు. 

పెళ్లయిన తర్వాత భార్య వేరే వాళ్లతో వెళ్లిపోతే, సుందర్‌(ఆనంద్‌ దేవరకొండ) అనే స్కూల్‌ టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తన భార్య ఇంట్లోనే ఉందని చెప్పడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? అసలు సుందర్‌ భార్య నిజంగానే వెళ్లిపోయిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘‘యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమా రూపొందించాం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి ఆదరణ దక్కింది.’’ అని దర్శక-నిర్మాతలు చెప్పుకొచ్చారు. రామ్‌ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందించటం విశేషం. సునీల్‌, నరేశ్‌, హర్షవర్థన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని