Anand Deverakonda: విజయ్‌ దేవరకొండ - అనసూయ క్లాష్‌.. ఆనంద్‌ రియాక్షన్‌ ఏమిటంటే?

తన తదుపరి చిత్రం ‘బేబీ’ (Baby) ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda). ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి అనసూయ (Anasuya), తన సోదరుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)కు మధ్య నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు.

Published : 13 Jul 2023 02:00 IST

హైదరాబాద్‌: తన సోదరుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నటి అనసూయ (Anasuya) మధ్య ఏర్పడిన వివాదంపై నటుడు ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda) స్పందించారు. వ్యక్తిగతంగా ఆమెపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ‘‘నెగెటివ్‌, లేదా పాజిటివ్‌.. ఇప్పటివరకూ ఏదైతే జరిగిందో అది పూర్తిగా వాళ్లకు సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా ఆమెపై నాకు ఎలాంటి కోపం లేదు. నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి నేను ఎప్పుడూ ముందుంటా’’ అని ఆయన అన్నారు. అనంతరం ‘బేబీ’పై అనసూయ ట్వీట్‌ చేయడం గురించి మాట్లాడారు. ‘‘మా ట్రైలర్‌ నచ్చిందంటూ ఆమె ట్వీట్‌ చేయడం సంతోషంగా అనిపించింది. దాదాపు 7 మిలియన్ల మంది మా ట్రైలర్‌ ఇష్టపడ్డారు’’ అని ఆయన చెప్పారు.

ఇక, అనసూయ - విజయ్‌ దేవరకొండ మధ్య గత కొంతకాలంగా కోల్డ్‌ వార్‌ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె తరచూ విజయ్‌నుద్దేశించి పరోక్షంగా ట్వీట్లు చేసేవారు. ఇటీవల ఆయన నటించిన ‘ఖుషి’ పోస్టర్‌పై ‘ది విజయ్‌ దేవరకొండ’ అని ఉండటాన్ని తప్పుబడుతూ ఆమె వరుస ట్వీట్‌ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్‌ అభిమానులు ఆమెను ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ‘విమానం’ సక్సెస్‌మీట్‌లో ఈ విషయంపై అనసూయ మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని తాను ఈ గొడవను ఇంతటితో వదిలేయాలనుకుంటున్నానని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని