Animal Movie: ‘యానిమల్‌’లో ‘నాన్న’ పదం ఎన్నిసార్లు వచ్చిందంటే?

Animal Movie: తండ్రి అంటే అంతులేని ప్రేమ ఉన్న కొడుకుగా ‘యానిమల్‌’లో రణ్‌బీర్‌ నటించారు. మరి ‘నాన్న’ పదం సినిమాలో ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా?

Published : 27 Jan 2024 20:03 IST

Animal Movie: రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘యానిమల్‌’ (Animal Movie). బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులోనూ టాప్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

కొత్త మూవీ ఏదైనా ఓటీటీలోకి వస్తే దాన్ని నిశితంగా పరిశీలించే వాళ్లు ఎక్కువైపోతున్నారు. ఎందుకంటే ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్‌ చేసుకుంటూ చూడొచ్చు. అంతేకాదు, పలువురు ఔత్సాహికులు అనేక విషయాలను కూడా బ్రేక్‌ డౌన్‌ చేస్తుంటారు. ఇప్పుడు ‘యానిమల్‌’ విషయంలోనూ అదే జరిగింది. ఇందులో కథానాయకుడికి అతని తండ్రి అంటే ఎనలేని ప్రేమ. తండ్రికోసం ఎంతకైనా తెగిస్తాడు. ఫాదర్‌ సెంట్రిక్‌గా నడిచే ఈ సినిమాలో ‘పాపా’(నాన్న) అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? పది కాదు, 20 కాదు, ఏకంగా 196 సార్లు ‘పాపా’ పదాన్ని పలికారట. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

రష్మిక (Rashmika) కథానాయికగా నటించిన ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రి కీలక పాత్ర పోషించింది. అనిల్ కపూర్, బాబీ దేఓల్​, పృథ్వీరాజ్ తమదైన నటనతో కట్టిపడేశారు. ముఖ్యంగా ప్రతినాయకుడిగా బాబీ దేఓల్ నటన సినిమాకు హైలైట్‌. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ మూవీ తీసుకురానున్నట్లు  సందీప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని