Animal:‘యానిమల్‌’ విజయోత్సాహం

‘యానిమల్‌’తో భారీ హిట్‌ అందుకున్నారు తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక, అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌, త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రవిది.

Updated : 08 Jan 2024 09:20 IST

‘యానిమల్‌’తో భారీ హిట్‌ అందుకున్నారు తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక, అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌, త్రిప్తి దిమ్రీ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రవిది. ఆదివారం ఈ చిత్రబృందమంతా ఒక్కచోటికి చేరింది. విజయాన్ని ముంబయిలో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను ఉద్దేశించి రణ్‌బీర్‌ మాట్లాడుతూ ‘ఇలాంటి ప్రేమ, విజయం, వసూళ్లు చూసి సంతోషంలో తడిసిపోతున్నాం. ఒక సినిమాపై ప్రేమ ఎలాంటి రికార్డులైన సృష్టిస్తుందని దీనితో నిరూపితమైంది’ అన్నారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా చిత్రంలోని పాత్రలను ఒక మెజీషియన్‌లా అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు బాబీ దేవోల్‌. ఈ కార్యక్రమంలో దర్శకుడితోపాటు అలియా భట్‌, తమన్నా, విద్యా బాలన్‌ తదితరులు అతిథులుగా హజరై, సందడిని రెట్టింపు చేశారు. ‘యానిమల్‌’కి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని