Annapurna Photo Studio: ‘ఈటీవీ విన్‌’లోకి ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

చైతన్య రావ్‌ ప్రధాన పాత్రలో పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది.

Published : 04 Aug 2023 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘30 వెడ్స్‌ 21’తో మంచి గుర్తింపు పొందిన నటుడు చైతన్య రావ్‌ (Chaitanya Rao). ఈయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). లావణ్య కథానాయిక. ‘ఓ పిట్ట క‌థ‌’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చెందు ముద్దు రెండో ప్ర‌య‌త్నం ఇది. ‘పెళ్లిచూపులు’, ‘డియ‌ర్ కామ్రేడ్’ చిత్రాల నిర్మాణంలో భాగ‌మైన బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమా జులై 21న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఓటీటీ (ott) ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో ఈ సినిమా ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీలోకి వచ్చేసిన ‘భాగ్‌ సాలే’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

క‌థేంటంటే: 1980 ద‌శ‌కం అది. గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం అనే అంద‌మైన ప‌ల్లెటూరు. ఆ ఊళ్లో చంటి (చైతన్య రావ్‌) త‌న స్నేహితుడితో క‌లిసి త‌ల్లి పేరు మీద అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో న‌డుపుతుంటాడు. జ్యోతిష్యుడైన త‌న తండ్రికి చుట్టు ప‌క్క‌ల ఎంతో మంచి పేరు. చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. స్నేహితులంతా ఎగ‌తాళి చేస్తుంటారు. ఇంత‌లోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్ట‌ప‌డుతుంది. ఇక, ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ కంచికి చేరిన‌ట్టే అనుకునేలోపే విష‌యం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌత‌మి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది? చంటి ఓ హ‌త్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు?ఆత్మ‌హ‌త్యకి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? ఇంత‌కీ చంటి, గౌత‌మి ఒక్క‌ట‌య్యారా, లేదా? అన్నది మిగతా కథ.

పూర్తి రివ్యూ కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని