Vishwak Sen: ‘36 ఏళ్లకు పెళ్లి చేసుకుంటే నేరమా?’.. జైల్లో వేస్తారా?

‘నాకిప్పుడు 33 ఏళ్లు. ఇంకో మూడు సంవత్సరాలకు 36 వస్తాయి. 36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా? అది నేరమా?’ అని ప్రశ్నిస్తున్నాడు నటుడు విశ్వక్‌ సేన్‌. నిజజీవితంలో కాదులేండి!

Published : 20 Apr 2022 17:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నాకిప్పుడు 33 ఏళ్లు. ఇంకో మూడు సంవత్సరాలకు 36 వస్తాయి. 36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా? అది నేరమా?’ అని ప్రశ్నిస్తున్నాడు నటుడు విశ్వక్‌ సేన్‌. నిజజీవితంలో కాదండోయ్‌! ఆయన నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాలోని సంభాషణ ఇది. దర్శకుడు విద్యాసాగర్‌ చింతా రూపొందించిన ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. కామెడీ+ ఎమోషన్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంది. సన్నివేశాలకు తగ్గట్టు వినిపించే ‘రాసేసుంటుంది మొత్తం.. పెళ్లి స్క్రిప్టు’ అనే వాయిస్‌ ఓవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

ఈ చిత్రంలో తెలంగాణ అబ్బాయి అర్జున్‌కుమార్‌గా విశ్వక్‌ సేన్‌, ఆంధ్రా అమ్మాయి మాధవిగా రుక్షర్‌ థిల్లాన్‌ కనిపించనున్నారు. అంత వయసొచ్చినా అర్జున్‌కు పెళ్లి ఎందుకు అవలేదు? ఎట్టకేలకు సంబంధం ఖాయం అయినా అర్జున్‌ను పెళ్లాడటానికి మాధవి ఎందుకు నో చెప్పింది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎస్వీసీసీ డిజిటల్‌ పతాకంపై బాపినీడు, సుధీర్‌ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జై క్రిష్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని