Athidhi Trailer: నటుడు వేణు తొలి వెబ్‌సిరీస్‌.. దెయ్యంతో భయపెట్టేందుకు రెడీ!

నటుడు వేణు కీలకపాత్రలో రూపొందిన తొలి వెబ్‌సిరీస్‌ ‘అతిథి’ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. డిస్నీ+హాట్‌స్టార్‌ ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది.

Updated : 09 Sep 2023 16:44 IST

హైదరాబాద్‌: ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నటుడు వేణు (Venu Thottempudi). కొంతకాలం నటనకు విరామం తీసుకున్న ఆయన, ఇటీవల రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు మరో సరికొత్త వేదికపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన కీలక పాత్రలో భరత్‌ వైజీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘అతిథి’ (Athidhi). డిస్నీ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా హారర్‌ నేపథ్యంలో సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచారం చిత్రం చూస్తే అర్థమవుతోంది. వేణుకు ఇదే తొలి వెబ్‌సిరీస్‌ కావడం గమనార్హం.

మరోసారి ‘అన్నమయ్య’ తీద్దామనుకుంటే ‘శిరిడిసాయి’ పట్టాలెక్కింది!

వర్షం పడుతున్న రాత్రివేళ ఊరి చివరిన ఉన్న భవంతిలోకి మాయ (అవంతిక) అనే అమ్మాయి వస్తుంది. అక్కడ ఉండే నవలా రచయిత రవివర్మను (వేణు)ను మాయ ఆశ్రయం అడుగుతుంది. అయితే, అందుకు రవివర్మ నిరాకరిస్తాడు. ఆ తర్వాత నుంచి భవంతిలో పరిస్థితులు మారిపోతాయి. అందులోని ఉన్న వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అక్కడకు వచ్చిన మాయ అనే యువతి ఎవరు? ఆమె ఎందుకు అక్కడకు వచ్చింది? ఆమె వచ్చి వెళ్లిన దగ్గరి నుంచి భవంతిలో జరిగిన పరిణామలేంటి? అన్నది తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని