balakrishna:బాలకృష్ణ సరసన ముగ్గురు నాయికలు?

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఈ మధ్యకాలంలో చేసిన ప్రతి సినిమాలోనూ భిన్న కోణాలున్న పాత్రని పోషించారు.

Updated : 06 Dec 2023 09:37 IST

గ్ర కథానాయకుడు బాలకృష్ణ ఈ మధ్యకాలంలో చేసిన ప్రతి సినిమాలోనూ భిన్న కోణాలున్న పాత్రని పోషించారు. ఆ పాత్రలు అలా డిమాండ్‌ చేశాయి. ఆయన కొత్త సినిమాలోనూ అదే తరహాలోనే సందడి చేయనున్నట్టు సమాచారం. బాలకృష్ణ కొత్త చిత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం భిన్న కాలాల్ని ప్రతిబింబించే కథతో రూపొందుతుండడం... ఆ కథ సాగే కాలానికి తగ్గట్టుగానే బాలకృష్ణ మూడు కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయన సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఊటీలో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, కథానాయిక ఊర్వశీ రౌతేలాతోపాటు ఇతర తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మీనాక్షి చౌదరితోపాటు, మరో అగ్ర కథానాయిక పేరు కూడా పరిశీలనలో ఉంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని