Bawaal: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న జాన్వీ-వరుణ్‌ల కొత్త మూవీ

Bawaal On Prime: వరుణ్‌ ధావన్‌, జాన్వీకపూర్‌ జంటగా నటించిన ‘బవాల్‌’ నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది.

Published : 19 Jun 2023 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా కొత్త సినిమాలు థియేటర్‌లో సందడి చేసిన తర్వాత ఓటీటీలో విడుదలవుతుంటాయి. ఇటీవల కొందరు దర్శక-నిర్మాతలు కేవలం ఓటీటీల కోసమే కొన్ని చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో వరుణ్‌ ధావన్‌(Varun Dhawan), జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) జంటగా నటించిన మూవీ ‘బవాల్‌’ (Bawaal). షాజిద్‌ నదియాద్‌వాల్‌ నిర్మాత. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదికగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ (Bawaal On Prime) కానుంది. జులై నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తెలిపింది. అయితే, తేదీ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. 200 దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ‘ప్రతి ప్రేమ కథ ఒక యుద్ధమే’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో ‘బవాల్‌’ కథ సాగనున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. చిత్రం ఈఫిల్‌ టవర్‌ను కూడా చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని