BellBottom: రా ఏజెంట్‌గా అక్షయ్‌కుమార్‌.. కోడ్‌ నేమ్‌ ‘బెల్‌బాటమ్‌’

బాలీవుడ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బెల్‌బాటమ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ ప్రధానపాత్రలో నటించారు. రంజిత్‌ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణీ కపూర్‌ కథానాయిక. లారా దత్తా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. ఇందులో అక్షయ్‌కుమార్‌ అండర్‌ కవర్‌ రా ఏజెంట్‌ ‘బెల్‌బాటమ్‌’గా కనిపించనున్నాడు.

Published : 04 Aug 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బెల్‌బాటమ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది. ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. రంజిత్‌ తివారీ తెరకెక్కించిన ఈ చిత్రంలో వాణీ కపూర్‌ కథానాయిక. లారా దత్తా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. ఇందులో అక్షయ్‌కుమార్‌ అండర్‌ కవర్‌ రా ఏజెంట్‌ ‘బెల్‌బాటమ్‌’గా కనిపించనున్నాడు. బెల్‌బాటమ్‌ అనేది అక్షయ్‌కుమార్ కోడ్‌ నేమ్‌. లారా దత్తా భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుండగా.. అక్షయ్‌కుమార్ భార్యగా వాణీకపూర్‌ సందడి చేయనుంది. యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా మంగళవారం విడుదలైంది.

ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ హైజాక్‌కు గురయ్యే సన్నివేశంతో ప్రారంభమయ్యే ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్‌ చూస్తుంటే.. అక్షయ్‌కుమార్‌ వన్‌మ్యాన్‌ ఆర్మీలా పనిచేశాడు అనే భావన కలిగేలా ఉంది. 1984లో హైజాక్‌కు గురైన క్రాఫ్ట్‌ జాడను గుర్తించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారుతుంది. దాన్ని చేధించేందుకు రహస్యంగా సాగిన సీక్రెట్‌ ఆపరేషన్‌ను రా ఏజెంట్‌గా ఉన్న బెల్‌బాటమ్‌ ఎలా  ముందుకు తీసుకెళ్లాడు. ఆ క్రాఫ్ట్‌లో ఉన్నవాళ్లను ఎలా రక్షించాడు..? హైజాక్‌ చేసిన వాళ్లను కనిపెట్టే క్రమంలో బెల్‌బాటమ్‌ ఎలాంటి ప్లాన్‌లు వేశాడు. పై అధికారుల ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కథ. ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్‌ను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని