Bigg boss 5: యూజ్ అండ్ త్రో బ్యాచ్ ఉన్నారిక్కడ.. అదరగొట్టిన సన్నీ, కాజల్, శ్రీరామ్
హాట్సీట్లో కూర్చొని నవ్వకుండా ఉన్నవాళ్లకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని బిగ్‌బాస్(Bigg boss) టాస్క్ ఇచ్చిన
హైదరాబాద్: హాట్సీట్లో కూర్చొని నవ్వకుండా ఉన్నవాళ్లకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని బిగ్‌బాస్(Bigg boss) టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో మానస్, శ్రీరామ్ విజేతలుగా నిలిచారు. ఈ క్రమంలో హౌస్కాల్ తీసుకోవాల్సి ఉండగా, ‘శ్రీరామ్‌కు ఇప్పటికే ఫినాలే టికెట్ లభించింది. మానస్‌కు అవకాశం ఇస్తే బాగుంటుంది’ అని ఇంటి సభ్యులు అభిప్రాయపడ్డారు. మానస్‌కు ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పాలని శ్రీరామ్ అడిగాడు. ఈ క్రమంలో హౌస్కాల్ తీసుకుందామంటూ కాజల్ ప్రతిపాదించడం వాగ్వాదానికి దారి తీసింది. దీనిపై శ్రీరామ్, కాజల్ గొడపడ్డారు. చివరకు మానస్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకూ తనకు ఓటు వేసిన ప్రేక్షకులకు మానస్ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే గ్రాండ్ ఫినాలేకు తీసుకెళ్లాలని, అందుకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశాడు. తనతో పాటు తన స్నేహితులైన సన్నీ, కాజల్‌కు కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాడు.
ఆ తర్వాత శ్రీరామ్, కాజల్ మధ్య గొడవ ఇంకొంతసేపు జరిగింది. ఈ క్రమంలో ‘నువ్వు అలా చెప్పొద్దు బ్రదర్’ అని కాజల్ పిలవడంతో ‘ఎవరు నీకు బ్రదర్ లైట్ తీసుకో’ అని అనడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ‘నువ్వు అనవసరంగా మాట్లాడావు. కొంచెం సేపు మాట్లాడకుండా ఉండు’ అని మానస్, సన్నీలు కాజల్‌కు సలహా ఇచ్చారు. ఆ తర్వాత కిచెన్‌లో భోజనం చేస్తున్న శ్రీరామ్ దగ్గరకు వెళ్లిన సన్నీ ‘కాజల్‌తో మాట్లాడవచ్చు కదా. మానస్‌కు ఫేవర్ చేద్దామని అలా అన్నది. అంతేతప్ప ఆమెకు వేరే ఉద్దేశం లేదు’ అని శ్రీరామ్‌కు సన్నీ సలహా ఇచ్చాడు. అయినా కూడా కాజల్‌తో మాట్లాడేందుకు శ్రీరామ్ అంగీకరించలేదు.
నేనూ సిరి టాప్-5లో ఉంటా: షణ్ముఖ్
టాప్-5లో ఎవరు ఉంటారు? అని గార్డెన్ ఏరియాలో కూర్చొన్న షణ్ముఖ్‌ను శ్రీరామ్ అడగ్గా, ‘వేరే వాళ్ల సంగతి నాకు తెలియదు. నేను, సిరి ఉంటాం’ అని సమాధానం ఇచ్చాడు. ఫ్రెండ్స్‌కు ఇవ్వకుండా ఓటు అడిగే అవకాశం మానస్ తనకు ఎలా ఇచ్చాడా? అని శ్రీరామ్‌తో షణ్ముఖ్ అన్నాడు. ప్రియాంక వెళ్లిపోయిన తర్వాత అతను అందరితో కలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ‘అనాల్సినవన్నీ అనేసి ఆ తర్వాత ఏదైనా అంటే కాజల్ ఏడుస్తుంది’ అని శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. మరోవైపు కిచెన్‌లో కూర్చొన్న సన్నీ, మానస్ మాట్లాడుకుంటూ ‘టాప్-6 ర్యాంకులు ఇచ్చినప్పుడు చెప్పిన కారణాలు నాకు నచ్చలేదు’ అని మానస్ అనగా, ‘గెలిచిన, ఓడినా వీళ్లు నిజాయతీగా ఆడారన్న పేరు వస్తే చాలు. వీళ్ల గురించి ఆలోచించకు’ సన్నీ అన్నాడు. కాళ్లకు గాయాలు అయి, ఇబ్బంది పడిన శ్రీరామ్‌కు వేళకు మందులు ఇచ్చి సపర్యలు చేసిన కృతజ్ఞత కూడా లేకుండా శ్రీరామ్ ప్రవర్తించాడని, హౌస్‌లో యూజ్ అండ్ త్రో బ్యాచ్ ఎక్కువగా ఉంది అంటూ మానస్ అభిప్రాయపడ్డాడు.
అదరగొట్టిన సన్నీ, కాజల్, శ్రీరామ్
తర్వాతి టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌కు సినిమా స్టార్స్ క్యారెక్టర్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. సమయానుసారంగా ఆయా స్టార్ పాట వచ్చినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న స్టేజ్‌పై డ్యాన్స్ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ సూచించాడు. ఈ క్రమంలో బాలకృష్ణగా సన్నీ, చిరంజీవిగా శ్రీరామ్, శ్రీదేవిగా కాజల్, సూర్యగా షణ్ముఖ్, పవన్‌కల్యాణ్‌గా మానస్, జెనీలియా పాత్రను సిరికి ఇచ్చాడు. దీంతో ఆయా స్టార్ల పాటలు వచ్చినప్పుడు హౌస్మేట్స్ అందరూ తమదైన శైలిలో డ్యాన్స్ చేసి అదరగొట్టారు. ఇక ఖాళీ సమయంలో స్టార్స్వాయిస్తో మాట్లాడుకుంటూ అలరించారు. బాలకృష్ణగా సన్నీ, శ్రీదేవిగా కాజల్, చిరంజీవిగా శ్రీరామ్ ఎక్కువసేపు వారి పాత్రల్లో మాట్లాడుతూ నవ్వులు పంచారు.
మళ్లీ సిరి, షణ్ముఖ్ గిల్లికజ్జాలు
ఇక ఈ టాస్క్ రెండో లెవల్లో భాగంగా ఇంటి సభ్యులు మీ పాత్రలు పోషిస్తూ ఒక స్కిట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు. ‘నాకు స్కిట్స్ రావు. మీరంతా ఒక బ్యాచ్ బ్రో’ అంటూ షణ్ముఖ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సిరి అతడిని బతిమలాడేందుకు ప్రయత్నించింది. ‘నాతో కూర్చొని ఉంటే మూడ్ ఆఫ్‌లో ఉంటావు. అందుకనే అక్కడకు వెళ్లు. చాలా సంతోషంగా ఉంటావు’ అంటూ సిరిని సతాయించడం మొదలు పెట్టాడు. ‘నీతో కలవలేకపోతున్నాను. అక్కడ నువ్వు బెటర్ పర్సన్’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత స్కిట్ చేసేందుకు షణ్ముఖ్ ఒప్పుకొన్నా, సిరి కోపంతో అక్కడి నుంచి వెళ్లి బాత్రూమ్లో కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది. అక్కడకు వెళ్లిన షణ్ముఖ్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. చివరికు ఇద్దరూ నవ్వుకుంటూ గేమ్ ఆడటానికి వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు