sharwanandh: శర్వా కోసం ఇద్దరు భామలు?

‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. ఇప్పుడాయన తదుపరి చిత్రాన్ని హీరో శర్వానంద్‌తో రూపొందించేందుకు సమాయత్తమవుతున్నారు.

Updated : 31 Jan 2024 09:33 IST

‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. ఇప్పుడాయన తదుపరి చిత్రాన్ని హీరో శర్వానంద్‌తో రూపొందించేందుకు సమాయత్తమవుతున్నారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వాకు జోడీగా ఇద్దరు నాయికలు కనిపించనున్నారని తెలిసింది. ఇందుకోసం సంయుక్తా మేనన్‌తో పాటు సాక్షి వైద్య పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర వర్గాలు వాళ్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ నచ్చడంతో వాళ్లు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అది ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ కొత్త చిత్రం పట్టాలెక్కనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు