Yash: హీరోగా కొరియోగ్రాఫర్‌ యశ్‌.. ‘బలగం’ నిర్మాణ సంస్థలో

కొరియోగ్రాఫర్‌ యశ్‌ హీరోగా పరిచయంకానున్నారు. ఆయన నటిస్తున్న తొలి సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ సోమవారం విడుదలయ్యాయి.

Updated : 24 Jul 2023 19:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బలగం’ (Balagam) సినిమాతో మంచి గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థ ‘దిల్‌ రాజ్‌ ప్రొడక్షన్స్‌’ (Dil Raju Productions). ఆ విజయోత్సాహంలో ఉన్న సదరు సంస్థ కొత్త నటీనటులతో మరో సినిమాకి ఇటీవల శ్రీకారం చుట్టింది. ఆ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ స్పెషల్‌ వీడియోను సోమవారం విడుదల చేసింది. ‘ఆకాశం దాటి వస్తావా’ (Aakasam Dhaati Vasthaava) అనే పేరు ఖరారైన ఈ లవ్‌స్టోరీతో కొరియోగ్రాఫర్‌ యశ్వంత్‌/యశ్‌ (Yash) హీరోగా పరిచయంకానున్నాడు. కార్తీక మురళీధరన్‌ కథానాయికగా నటిస్తోంది. శశి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కార్తీక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

‘బ్రో’ కోసం పవన్‌ ఉపవాసం.. 53 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేశాం: సముద్రఖని

టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. ‘‘బలగం’ చిత్రీకరణ సమయంలోనే ఈ సినిమా ప్రస్తావన వచ్చింది. అందరూ కొత్తవారే కావాలని దర్శకుడు శశికి చెప్పా. అలా కొరియోగ్రాఫర్‌ యశ్‌ ఈ సినిమాతో నటుడిగా మారుతున్నాడు. అంతకంటే ముందు ఓ సందర్భంలో హీరోలా ఉంటావని అతడితో అన్నా. డ్యాన్స్‌ పరంగా అతడికి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ సినిమాతో ఆ సంఖ్య పెరగాలని కోరుకుంటున్నా. సింగర్‌ కార్తీక్‌ అందించిన బాణీలు అందరినీ అలరిస్తాయి. ప్రేమలో ఉన్నప్పుడు చాలామంది గొప్పగా మాట్లాడతుంటారు. వాటిల్లోంచి వచ్చిందే ఈ సినిమా టైటిల్‌’’ అని తెలిపారు. దిల్‌ రాజు నుంచి కాల్‌ వస్తే పాటలకు కొరియోగ్రఫీ చేసేందుకు పిలిచారనుకున్నానని, ఆ సినిమాలో తానే హీరో అని తెలియగానే షాక్‌ అయ్యానని యశ్‌ పేర్కొన్నారు. ‘ఢీ’ (ఈటీవీ) షో వేదికగా తన ప్రతిభను చూపిన యశ్‌.. ‘యూటర్న్‌’, ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, ‘ప్రతిరోజూ పండగే’, ‘చిత్రలహరి’, ‘ఖిలాడి’, ‘బింబిసార’, ‘ధమాకా’ తదితర చిత్రాల్లోని హిట్‌ పాటలకు నృత్యరీతులు సమకూర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు