Ilaiyaraaja: ఇళయరాజా బయోపిక్‌.. లీడ్‌ రోల్‌లో స్టార్‌ హీరో..!

ఇళయరాజా బయోపిక్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. 

Published : 10 Nov 2023 20:35 IST

చెన్నై: దిగ్గజ సంగీత దర్శకుడు, మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా తెరకెక్కనుందంటూ గత కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఓ ప్రకటన వెలువడింది. కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ధనుష్‌ హీరోగా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ఇది పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే 2025లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Japan Movie Review: రివ్యూ: జపాన్‌. కార్తి కొత్త చిత్రం మెప్పించిందా?

అద్భుతమైన చిత్రాలను నిర్మించాలనే సంకల్పంతో కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంయుక్తంగా వర్క్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగా రానున్న మూడేళ్లలో భారీ బడ్జెట్‌తో అగ్ర నటీనటులతో చిత్రాలు చేయాలని భావిస్తున్నాయి. అందులో ఒకటే ఈ సినిమా. దీనికి దర్శకత్వం ఎవరు వహిస్తారు?మిగిలిన పాత్రల్లో ఎవరెవరు నటించనున్నారు?అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక, ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ‘కెప్టెన్‌ మిల్లర్‌’, ధనుష్‌ 50 కాకుండా దర్శకులు శేఖర్‌ కమ్ముల, మారీ సెల్వరాజ్‌, అరుణ్‌ మాథేశ్వరన్‌, ఆనంద్‌ ఎల్‌.రాయ్, వెట్రిమారన్‌తో ఆయన సినిమాలు చేయనున్నారు. ‘కెప్టెన్ మిల్లర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని