
Marakkar: 3న సముద్ర సింహం రాక
‘మన్యం పులి’గా గర్జించిన అగ్ర నటుడు మోహన్‌లాల్, త్వరలోనే అరేబియా సముద్ర సింహంలా పంజా విసరనున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మరక్కార్’. అరేబియా సముద్ర సింహం... అనేది ఉపశీర్షిక. ప్రియ దర్శన్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. ‘‘మోహన్‌లాల్ - ప్రియదర్శన్ కలయికలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రమిది. ఇప్పటికే జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకుంది. తెలుగు, మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. అర్జున్, సునీల్‌శెట్టి, కిచ్చా సుదీప్, ప్రభు, మంజు వారియర్, కీర్తిసురేష్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.