Beast: మృగరాజుతో బతుకుపోరాటం

మృగరాజుకు, మనుషులకు మధ్య సంఘర్షణను మరోసారి చూపించడానికి ‘బీస్ట్‌’ సిద్ధమయింది. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ ఫేం ఇడ్రస్‌ ఎల్బా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. బోల్టసార్‌

Updated : 27 May 2022 08:16 IST

మృగరాజుకు, మనుషులకు మధ్య సంఘర్షణను మరోసారి చూపించడానికి ‘బీస్ట్‌’ సిద్ధమయింది. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ ఫేం ఇడ్రస్‌ ఎల్బా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. బోల్టసార్‌ కార్మేకర్‌ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19న ఈ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. భార్య నుంచి విడిపోయి ప్రశాంతత కోసం తన ఇద్దరి పిల్లలతో కలిసి గేమ్‌ రిజర్వ్‌ అనే ప్రాంతానికి కథానాయకుడు వెళ్తాడు. అక్కడ మనుషులను శత్రువులుగా భావించే సింహం బారిన పడిన వీరు ఎలా పోరాడారు? ఎలా తప్పించుకున్నారు? అనేది తెరపైనే చూడాలి. తన కుమార్తెలను కాపాడే క్రమంలో ఇడ్రస్‌, సింహం మధ్య నడిచే పోరాట సన్నివేశాలు గగుర్పాటుకు గురిచేస్తాయని ట్రైలర్‌లోనే రుచి చూపించారు. ఇందులో ఇడ్రస్‌ కుమార్తెలుగా ఇయానా హేలీ, సావా జెఫ్రీస్‌ నటించగా స్నేహితుడి పాత్రలో వైల్డ్‌లైఫ్‌ బయాలజిస్ట్‌గా మార్టిన్‌ బాటిల్స్‌ కనిపిస్తాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని