Bimbisara: యుద్ధం మీద పడితే!

‘‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’’ అంటున్నారు కల్యాణ్‌ రామ్‌. ఆయన హీరోగా వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై

Updated : 02 Jul 2022 07:20 IST

‘‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’’ అంటున్నారు కల్యాణ్‌ రామ్‌ (Kalyanram). ఆయన హీరోగా వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌.. అన్నది ఉపశీర్షిక. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కె.హరికృష్ణ నిర్మించారు. కేథరీన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జులై 4న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ‘‘వర్తమానానికి చరిత్రకు ముడిపెడుతూ ఓ విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందించారు. ఇందులో కల్యాణ్‌ రామ్‌ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. గ్రాఫిక్స్‌, పోరాట ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: చిరంతన్‌ భట్‌, నేపథ్య సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని