Tollywood: ఏమవుతుందో మన మనసులలో...

అప్పుడప్పుడే ప్రేమలో పడిన వారి మనసుల్లో ఏదో జరుగుతున్నట్లు ఉంటుంది. అదేదో తెలియని హాయిగా అనిపిస్తుంది. ఏదో మధురంగా... ఏదో అలజడిగా... సరిగ్గా ఇలాంటి పరిస్థితిని మనకు వివరించే ప్రయత్నం చేసింది ‘కృష్ణమ్మ’ చిత్రబృందం. సత్యదేవ్‌ కథానాయికుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి  ‘‘ఏమవుతుందో మనలో.

Updated : 20 Aug 2022 09:27 IST

ప్పుడప్పుడే ప్రేమలో పడిన వారి మనసుల్లో ఏదో జరుగుతున్నట్లు ఉంటుంది. అదేదో తెలియని హాయిగా అనిపిస్తుంది. ఏదో మధురంగా... ఏదో అలజడిగా... సరిగ్గా ఇలాంటి పరిస్థితిని మనకు వివరించే ప్రయత్నం చేసింది ‘కృష్ణమ్మ’ (Krishnamma) చిత్రబృందం. సత్యదేవ్‌ (Satyadev) కథానాయికుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి  ‘‘ఏమవుతుందో మనలో... మన మనసులలో,  ఏం జరిగిందో కలలో... తలమునకలలో...,  ఏమెదురైందో కథలో... మలి మలుపులలో..., ఏం కదిలిందో యదలో... లోతులో...’’ అంటూ సాగే గీతాన్ని శుక్రవారం దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. కాలభైరవ సంగీతమందించిన ఈ పాటను సిద్‌శ్రీరామ్‌ ఆలపించారు. అనంత్‌శ్రీరామ్‌ ప్రేమికుల గుండెలో ఏం జరిగిందో కనిపెట్టి.. దానికి అక్షరాలు కూర్చి మనకు పాటగా రాశారు. దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్నారు. మాటలు: సురేష్‌బాబా, ఎడిటర్‌: తమ్మిరాజు, ఆర్ట్‌: రామ్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ : సన్ని కూరపాటి.


టిల్లుకి జోడీగా ఎవరో!

‘డీజే టిల్లు’కి (DJ Tillu) కొనసాగింపుగా మరో చిత్రం తెరకెక్కనుంది. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. రెండో చిత్రంలోనూ టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డనే (Siddu Jonnalagadda) సందడి చేయనున్నారు. దర్శకత్వ బాధ్యతలు మరొకరు చేపట్టబోతున్నారు. కథానాయిక కూడా మారనున్నట్టు తెలిసింది. అనుపమ పరమేశ్వరన్‌, శ్రీలీల... ఇలా పలువురు భామల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి  ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనేది చూడాలి. ‘డీజే టిల్లు’లో టిల్లు పాత్ర ఎంతగా చేరువైందో, కథానాయిక రాధిక పాత్ర అదే స్థాయిలో ఆకట్టుకుంది. మరి రెండో సినిమాలో రాధికగా ఎవరనేది చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని