నీలాగే కనపడే వ్యక్తి నీకు ఎదురుపడితే!

కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా రాజేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆషికా రంగనాథ్‌ కథానాయిక.

Published : 08 Nov 2022 02:13 IST

ల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా రాజేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. ఈ సినిమాకి ముందు నుంచి అనుకున్నట్లుగానే ‘అమిగోస్‌’ అనే టైటిల్‌నే ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటిస్తూ.. టైటిల్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో కల్యాణ్‌ రామ్‌ మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించారు. దీన్ని బట్టి ఈ సినిమాలో ఆయన పాత్ర మూడు పార్ష్శ్ళ్వాలో కనిపిస్తుందని అర్థమవుతోంది. ‘‘నీలాగే కనపడే ఇంకో వ్యక్తి నీకు ఎదురుపడితే నువ్వు చస్తావు అని చెప్తారు’’ అంటూ పోస్టర్‌పై ఉన్న వ్యాఖ్య ఆసక్తిరేకెత్తిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకి గిబ్రాన్‌ స్వరాలందిస్తున్నారు. ఎస్‌.సౌందర్‌ రాజన్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు