Agent: ఏందే.. ఏందే.. ఎట్నో అయితాందే

‘ఏజెంట్‌’ (Agent)గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు అఖిల్‌ (Akhil). ఆయన.. సాక్షి వైద్య జంటగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

Updated : 25 Mar 2023 07:07 IST

‘ఏజెంట్‌’ (Agent)గా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు అఖిల్‌ (Akhil). ఆయన.. సాక్షి వైద్య (Sakshi Vaidya) జంటగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా శుక్రవారం వైజాగ్‌లో జరిగిన సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఈ సినిమాలోని ‘‘ఏందే ఏందే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. తెలంగాణ యాసలో సాగుతున్న ఈ ప్రేమ పాటకు హిప్‌ హాప్‌ తమిళ స్వరాలు సమకూర్చగా.. చంద్రబోస్‌ సాహిత్యమందించారు. సంజిత హెగ్డే, పద్మలత, హిప్‌ హాప్‌ సంయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా హీరో అఖిల్‌ (Akhil) మాట్లాడుతూ.. ‘‘మాపై ప్రేక్షకులంతా ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మీరెంత ప్రేమను పంచినా మేము తీసుకుంటాం. మీ అందరి కోసమే ‘ఏజెంట్‌’ను తీసుకొస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా వైల్డ్‌ సాలే మ్యాజిక్‌ను తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అంది నాయిక సాక్షి. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని