Tripti Dimri: రూహ్‌ బాబా మ్యాజిక్కే వేరు!

‘యానిమల్‌’ చిత్రంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్‌ భామ త్రిప్తి దిమ్రి.

Updated : 30 Mar 2024 12:03 IST

యానిమల్‌’ చిత్రంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్‌ భామ త్రిప్తి దిమ్రి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆమె.. ‘భూల్‌ భులయ్యా 3’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె, కార్తిక్‌ ఆర్యన్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. అనీస్‌ బాజ్మీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రూహ్‌ బాబా పాత్రలో సందడి చేయనున్నారు కార్తిక్‌. ఇటీవలే షూటింగ్‌ను ప్రారంభించుకున్న ఈ సినిమా.. మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలుపుతూ ఓ ఫొటోను పంచుకుంది త్రిప్తి. ‘‘ఎంతో అద్భుతంగా మొదలు పెట్టిన మా ప్రయాణంలో మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించాము. కానీ ఈ చిన్న విరామం నన్ను అసహనానికి గురి చేస్తుంది. ఇందులో రూహ్‌ బాబా చేసే మ్యాజిక్‌ మరింత భిన్నంగా ఉండబోతుంది’’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. విద్యాబాలన్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు