బన్నీ సాంగ్‌కు సాగరకన్య డ్యాన్స్‌

బన్నీ సినిమాలోని ఓ హిట్‌ సాంగ్‌కు తన స్టైల్‌లో టిక్‌టాక్‌ చేసి అలరించారు నటి శిల్పాశెట్టి. విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు శిల్పాశెట్టి. ‘సాగర కన్య’గా ఎందరో అభిమానుల...

Updated : 08 Dec 2022 18:43 IST

శిల్పాశెట్టి స్టైల్‌లో ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ 

ముంబయి: బన్నీ సినిమాలోని ఓ హిట్‌ సాంగ్‌కు తన స్టైల్‌లో టిక్‌టాక్‌ చేసి అలరించారు నటి శిల్పాశెట్టి. విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సాహస వీరుడు సాగర కన్య’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆమె. ‘సాగర కన్య’గా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న శిల్పా దక్షిణాది చిత్రాలతోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా అల్లు అర్జున్‌ నటించిన ‘అల..వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం అది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. శిల్పా డ్యాన్స్‌ చూసిన అభిమానులు.. చాలా చక్కగా ఉందంటూ ఆమెను ప్రశంసించారు. మరికొందరైతే.. ‘బుట్టబొమ్మా.. శిల్పా స్టైల్‌ అదుర్స్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో’. పూజాహెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కలెక్షన్స్‌పరంగా కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ రికార్డులను కొల్లగొట్టింది.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని