చిరుతో సినిమాపై సోనూసూద్‌ రియాక్షన్‌

మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమాలో ప్రముఖ నటుడు సోనూసూద్‌ నటించబోతున్నారట. గత కొన్నిరోజులుగా ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్ని సోనూసూద్‌ తాజాగా ధృవీకరించారు. చిరు చిత్రంలో నటించబోతున్నట్లు తెలిపారు. ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ..

Published : 28 Feb 2020 23:31 IST

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమాలో ప్రముఖ నటుడు సోనూసూద్‌ నటించబోతున్నారట. గత కొన్నిరోజులుగా ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్ని సోనూసూద్‌ తాజాగా ధ్రువీకరించారు. చిరు చిత్రంలో నటించబోతున్నట్లు తెలిపారు. ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘ఇలాంటి ప్రాజెక్టులో నటించడం, చిరంజీవి సర్‌తో వెండితెరను పంచుకోబోతుండటం నాకు చాలా గర్వంగా ఉంది. దక్షిణాది చిత్ర పరిశ్రమ నన్ను ఎంతగానో ఆదరించింది. ఈ సినిమా కోసం మరింత శ్రమించి.. వారు నాపై చూసిన ప్రేమను తిరిగి వినోదం రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను’ అని ఆయన చెప్పారు.

సోనూసూద్‌ ప్రస్తుతం రాజు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో తీస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడు. మరోవైపు ‘తమిళరసన్‌’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. చిరు 152 సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నారు. త్రిష కథానాయిక. కొణిదెల ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో చిరు లుక్‌ లీక్‌ అయ్యింది. ఆయన ఆచార్య అనే పాత్రలో సామాజికవేత్తగా కనిపించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని