నా లవ్‌లైఫ్‌ను ఇంకా కలవలేదు: త్రిష

తన లవ్‌లైఫ్‌ను ఇంకా కలవలేదని అగ్రకథానాయిక త్రిష అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి కొంత విశ్రాంతి దొరకడంతో సోషల్‌మీడియా వేదికగా త్రిష తన అభిమానులతో చేరువగా ఉంటున్నారు. ఇటీవల టిక్‌టాక్‌లోకి...

Published : 14 May 2020 15:54 IST

స్వచ్ఛమైన ప్రేమ ఉందని నమ్ముతున్నాను

హైదరాబాద్‌: తన లవ్‌లైఫ్‌ను ఇంకా కలవలేదని అగ్రకథానాయిక త్రిష అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ నుంచి కొంత విశ్రాంతి దొరకడంతో సోషల్‌మీడియా వేదికగా త్రిష తన అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఇటీవల టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన ఆమె పలు డ్యాన్స్‌ వీడియోలతో మెప్పిస్తూనే.. మరోవైపు ఇన్‌స్టాలో మధుర జ్ఞాపకాలతో నెటిజన్ల హృదయాలను హత్తుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా త్రిష ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో కొంతసమయం ముచ్చటించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు  సమాధానాలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా పలువురు నెటిజన్లకు వర్కౌట్ల విషయంలో కొన్ని సూచనలు కూడా చేశారు.

కాగా, ఓ నెటిజన్‌.. ‘త్రిష..మీ లవ్‌లైఫ్‌ను కలిశారా?’ అని అడగగా.. ‘ఇప్పటివరకూ మేమిద్దరం ఇంకా కలుసుకోలేదు’ అని త్రిష సమాధానం తెలిపారు. అనంతరం మరో నెటిజన్‌.. ‘నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ ఉందని మీరు నమ్ముతారా?’ అని ప్రశ్నించగా.. ‘స్వచ్ఛమైన ప్రేమ ఉందని నేను నిజంగానే నమ్ముతున్నాను. ప్రేమ అనేది లేకపోతే జీవించలేం. జీవితంలో అనుకున్నది సాధించాలంటే ప్రేమ అనేది కావాలి’ అని త్రిష తెలిపారు. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తన దృష్టిలో కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌, అమీర్‌ఖాన్‌ ఉత్తమ నటులని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని