Ghani: ‘నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్‌ లేదు’: వరుణ్‌ తేజ్‌

‘‘నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్‌ లేదు’’ అని అంటున్నారు నటుడు వరుణ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా...

Published : 17 Mar 2022 11:31 IST

హైదరాబాద్‌: ‘‘నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్‌ లేదు’’ అని అంటున్నారు నటుడు వరుణ్‌ తేజ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘గని’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. బాక్సింగ్‌ ఆడనని తన అమ్మకు మాటిచ్చిన ఓ యువకుడు.. బాక్సర్‌గా ఎలా మారాడు? నేషనల్‌ ఛాంపియన్‌ కావాలనే అతని కల నెరవేరిందా? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ‘‘ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది’’, ‘‘లైఫ్‌లో మంచోడ్ని కెలుకు, చెడ్డోడ్ని కెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనే పిచ్చోడ్ని మాత్రం కెలక్కు’’ అంటూ ట్రైలర్‌ చివర్లో వరుణ్‌ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతిబాబు, నదియా, సునీల్‌దత్‌ కీలకపాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని