Gummadi: రెండు చెంపలూ వాయించుకున్నా!

తన విలక్షణ నటనతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.

Published : 03 Oct 2023 12:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన విలక్షణ నటనతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. తండ్రిగా, తాతగానే కాదు, విలన్‌గానూ పలు పాత్రలు పోషించారు. పౌరాణికమైనా, సాంఘికమైనా ఆ పాత్రలో ఇమిడిపోయేవారు. ఏళ్ల కిత్రం తొలిసారిగా ఆయన సింగపూర్‌ వెళ్లారు. అక్కడి క్రమశిక్షణ, పరిశుభ్రత ఆయన్ని ఆశ్చర్యపరిచాయి. అక్కడ తనకు ఎదురైన అనుభవాన్ని ఓ సందర్భంగా ఇలా చెప్పారు.

‘‘సింగపూర్‌, అక్కడి ప్రదేశాలను చూసి ఆశ్చర్యపోయా. కారులో ఎక్కడికో వెళ్తూ, ఏదో ఆలోచిస్తూ అలవాటుగా చేతిలో ఉన్న సిగరెట్‌ని ఆర్పేసి, కిటికీలోంచి బయటికి విసిరేశాను. కొంత దూరం వెళ్లామో లేదో, పోలీసులు కారు ఆపి, సిగరెట్‌ రోడ్డుమీద పారేసిందెవరు? అని కనుక్కుని, నన్ను స్టేషన్‌కి తీసుకువెళ్లారు. రోడ్డుపై సిగరెట్‌ పారేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. నేను కొత్తవాడినని తెలిసి శిక్ష వెయ్యకుండా 500 డాలర్లు జరిమానా కట్టమన్నారు! అక్కడే నా రెండు చెంపలు వాయించుకుంటూ చచ్చినట్టు జరినామా కట్టాను. కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసులు, ఈ సిగరెట్‌ ఉదంతం ఎలా తెలుసుకున్నారో ఆశ్చర్యం! అప్పటికే టెక్నాలజీ అలా వచ్చేసింది సింగపూర్‌కి’’ అని విచారం, ఆశ్చర్యం వెలిబుచ్చారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని