Guns and Gulaabs: నవ్వులు పూయిస్తోన్న ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ తెలుగు ట్రైలర్‌

రాజ్‌కుమార్‌ రావ్‌, దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salman), ఆదర్శ్‌ గౌరవ్, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (Guns and Gulaabs)’.

Published : 08 Aug 2023 19:22 IST

హైదరాబాద్‌: రాజ్‌కుమార్‌ రావ్‌, దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salman), ఆదర్శ్‌ గౌరవ్, గుల్షన్‌ దేవయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్‌ ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (Guns and Gulaabs)’. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఆగస్టు 18 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ తెలుగు ట్రైలర్‌ నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఒక విభిన్న కథతో ఆసక్తికర కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’తో ప్రేక్షకులను అలరించిన రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే (Raj and DK) ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని