hansika: ‘105 మినిట్స్‌’... ఓ ప్రయోగం

ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్‌’. ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్ర పోషించగా... రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్‌ శివ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 20 Jan 2024 09:39 IST

కే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్‌’. ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్ర పోషించగా... రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్‌ శివ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. హన్సిక మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఓ ప్రయోగాత్మక చిత్రం నా కెరీర్‌లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. నటిగా నాకు ఇదొక అనుభవం. 34 నిమిషాల షాట్‌ని ఒకే టేక్‌లో చేశాం. అందుకోసం 8 రోజులుపాటు రిహార్సల్స్‌ చేశా. ఇలాంటి మరెన్నో ప్రయోగాలు సినిమాలో ఉంటాయి. సామ్‌ సీఎస్‌ సంగీతం ఈ సినిమాకి మరొక ప్రధాన పాత్రగా మారింది. ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుందీ చిత్రం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘తొలిసారి దర్శకత్వం వహిస్తున్న నన్ను, కంటెంట్‌ని నమ్మి ఈ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాతకి కృతజ్ఞతలు. అందరూ కలిసి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు