Happy Birthday: ‘ఇంటింటికీ గన్‌.. ఎదురులేని ఫన్‌’.. ఆసక్తిగా ‘హ్యాపీ బర్త్‌డే’ టీజర్‌

ఇంటింటికీ తాగు నీరు, ఉద్యోగం అనే మాటలు వింటుంటాం. ఇంటింటికీ గన్‌.. దాని వల్ల ఫన్‌ అని ఎప్పుడైనా విన్నారా? ‘గన్‌ బిల్‌’ గురించి మీకు తెలుసా? ఈ ఆసక్తికర ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా చూడాల్సిందే.

Published : 07 Jun 2022 14:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటింటికీ తాగు నీరు, ఉద్యోగం అనే మాటలు అప్పుడప్పుడూ వింటుంటాం. ఇంటింటికీ గన్‌.. దాని వల్ల ఫన్‌ అని ఎప్పుడైనా విన్నారా? ‘గన్‌ బిల్‌’ గురించి మీకు తెలుసా? ఈ ఆసక్తికర ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy BirthDay) సినిమా చూడాల్సిందే. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో ‘మత్తు వదలరా’ ఫేం రితేశ్‌ రానా తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఈ సినిమాని జులై 15న విడుదలచేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మంగళవారం టీజర్‌ను పంచుకుంది.

‘ఆయుధాల చట్టం అంటే..?’ అనే సంభాషణతో ప్రారంభమైన వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇందులోని కొన్ని పాత్రలు తుపాకీని పట్టుకుని కనిపించగా మరికొన్ని పాత్రలు తుపాకీ గురించి మాట్లాడుతూ కనిపించాయి. దీన్ని బట్టి ఈ సినిమా గన్‌ల చుట్టూ తిరిగే కథ అనిపిస్తోంది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఆయుధాల చట్టాన్ని ఎవరు అమలు చేశారు? ‘బర్త్‌ డే’ వేడుకకు తుపాకీలకు సంబంధం ఏంటి? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని