Vyooham:‌ ‘వ్యూహం’పై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా

‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

Updated : 09 Jan 2024 16:52 IST

హైదరాబాద్‌: రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకు ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

‘వ్యూహం’ ట్రైలర్‌ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్‌ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నచ్చరని చెప్పారని లోకేశ్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తెరవెనుక ఉండి ఈ సినిమా తీయించారన్నారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్‌ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని