sardar 2: సర్దార్‌ 2 సన్నాహాలు

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు కథానాయకుడు కార్తి. ఆయన కీలక పాత్రలో నటించిన ‘సర్దార్‌’ గతేడాది విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది.

Updated : 21 Dec 2023 09:44 IST

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు కథానాయకుడు కార్తి. ఆయన కీలక పాత్రలో నటించిన ‘సర్దార్‌’ గతేడాది విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కించారు. ఇందులో గూఢచారిగా, పోలీసు అధికారిగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు కార్తి. ఇటీవలే ఈ సినిమాకి కొనసాగింపుగా ‘సర్దార్‌ 2’ రానున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో షూటింగ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. రెండో భాగంలో కాంబోడియోలో గూఢచర్యం చేసే భారతీయ ఏజెంట్‌గా కనిపించనున్నారు కార్తి. పోలీసు అధికారిగా ఉన్న ఆయన.. స్పైగా మారి ఆ తర్వాత ఏం చేశారనేది చూపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు