Hyper aadi: అలా ‘జబర్దస్త్‌’లోకి వచ్చిన హైపర్‌ ఆది..

Hyper aadi: జబర్దస్త్‌ ద్వారా కమెడియన్‌గా పరిచయమైన ఆది వరుస సినిమా అవకాశాలను దక్కించుకోవడంతో పాటు, ఇటీవల మెగా క్యాంపులో చురుగ్గా కనిపిస్తున్నాడు.

Published : 10 Aug 2023 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. అంతేకాదు, ఎంతోమంది కమెడియన్లను సైతం తెలుగు చిత్ర పరిశ్రమకు అందించింది. ఇక తనదైన పంచ్‌లతో టైమింగ్‌తో జబర్దస్‌ షోలో నవ్వులు పంచే నటుడు ఆది. ‘హైపర్‌ ఆది’ (Hyper aadi)గా ఎంతో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల జనసేన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆది, వివిధ వేదికలపై తనదైన మాటలు, పంచ్‌లతో ఎప్పుడూ లైమ్‌ లైట్‌లో ఉంటున్నాడు. తాజాగా ‘భోళా శంకర్‌’ ప్రీరిలీజ్‌ కార్యక్రమంలో హైపర్‌ ఆది స్పీచ్‌ మెగా అభిమానులతో విజిల్స్‌ వేయించింది. మరి అలాంటి ఆది ‘జబర్దస్త్‌’ షోకు రాకుండా ఉంటే ఏం చేసేవాడు? ఇదే ప్రశ్నను ఆయనను అడిగితే ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు.

‘‘కేవలం ‘జబర్దస్త్‌’ మాత్రమే అనుకొని ఇక్కడకు రాలేదు. అసలు ఇందులోకి వద్దామని కూడా అనుకోలేదు. ఒకచోటు కూర్చొని చేసే జాబ్‌ బోర్‌ కొట్టేసింది. పక్కన వాళ్లను నవ్వించడం అంటే నాకు బాగా ఇష్టం. అలా చేయడానికి నాకు కనిపించిన దారి ‘జబర్దస్త్‌’. అంతేకానీ, ముందునుంచీ ఇందులోకి వెళ్దామని మాత్రం రాలేదు. అలా అనుకున్నప్పుడు ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్‌ను స్ఫూఫ్‌ చేసి వీడియో చేశాం. అది యూట్యూబ్‌లో పెడితే వేలమంది చూశారు. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తే ‘అదిరే అభి’ అన్న చూసి ‘బాగా చేశావ్‌ బ్రదర్‌. ఒకసారి కనిపించు’ అన్నాడు. అలా ‘జబర్దస్త్‌’లోకి ఎంటరయ్యా. వెళ్లిన వెంటనే ‘జబర్దస్త్‌’ టీమ్‌ సభ్యులతో కలిసి ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పెట్టేశా. అప్పటివరకూ రెండుమూడు లైక్‌లు వచ్చే నాకు నాకు వందల్లో వచ్చాయి. ఫొటోలు పెడితేనే ఇలా ఉందంటే.. మనం వాళ్లతో పాటు పక్క ఉంటే ఇంకా ఎలా ఉంటుందోనని వెళ్లా.’’ అంటూ తాను ‘జబర్దస్త్‌’లోకి వచ్చిన నేపథ్యాన్ని పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని