Poonam Pandey: నేను బతికే ఉన్నా: పూనమ్‌ పాండే

తాను బతికే ఉన్నానంటూ వీడియో షేర్‌ చేశారు నటి పూనమ్‌ పాండే (Poonam Pandey)

Updated : 03 Feb 2024 13:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను బతికే ఉన్నానంటూ ఇన్‌స్టాలో వీడియో షేర్‌ చేశారు బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే (Poonam Pandey). సర్వైకల్‌ క్యాన్సర్‌ నానాటికీ ప్రమాదకరంగా మారుతుందని.. దానిపై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్లు పోస్ట్ పెట్టించానని వెల్లడించారు. ‘‘మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలనుకుంటున్నా. నేను ఎక్కడికి వెళ్లలేదు. బతికే ఉన్నా. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ వల్ల ప్రాణాలు కోల్పోలేదు. కానీ, అది వేలాది మంది మహిళల ప్రాణాలు బలిగొంది. ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు. దీనిని నివారించడం సాధ్యమే. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ లేదా ముందస్తుగా గుర్తించడం అవసరం. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి. అందరికీ అవగాహన కల్పిద్దాం’’ అని ఆమె రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం సరికాదంటూ విమర్శిస్తున్నారు.

Kriti Sanon: టెక్నాలజీని నిందించడం సరికాదు.. డీప్‌ ఫేక్‌లపై కృతి సనన్‌ కామెంట్స్‌

2011 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా చేసిన ఓ ప్రకటనతో పూనమ్‌ చాలా పాపులర్‌ అయ్యారు. ఆమె వైవాహిక జీవితం కూడా వివాదాస్పదమైంది. భర్త శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన పూనమ్‌ 2013లో ‘నషా’తో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేశారు. పలు హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. ప్రముఖ నటి కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్‌ తొలి సీజన్‌లో పాల్గొన్నారు. పూనమ్‌ మరణం గురించి శుక్రవారం ఉదయం ఆమె ఇన్‌స్టా ఖాతాలో వ్యక్తిగత సిబ్బంది పోస్ట్‌ చేయడంతో ఈ వార్త ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె వీడియో రిలీజ్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని