Sandeep Reddy Vanga: షారుక్‌తో పని చేయాలని ఉంది: సందీప్‌ రెడ్డి వంగా

‘యానిమల్‌’ (Animal)తో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 03 Feb 2024 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్‌’. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రస్తుతం ఓటీటీలోనూ రాణిస్తోంది. ఈనేపథ్యంలోనే సందీప్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్‌తో కలిసి పని చేయాలని ఉందన్నారు. ‘‘కొంతకాలం క్రితం అనుకోనివిధంగా ఆయన్ని కలిశా. ‘యానిమల్‌’ టీజర్‌ చూపించా. తనకెంతో నచ్చిందని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. ఆయనొక గొప్ప నటుడు. భవిష్యత్తులో తప్పకుండా కలిసి పని చేయాలనుకుంటున్నా. రణ్‌వీర్‌ సింగ్‌తోనూ సినిమా చేయాలని ఉంది’’ అని సందీప్‌ అన్నారు.

తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో ఇది రూపుదిద్దుకొంది. రష్మిక (Rashmika) కథానాయిక. త్రిప్తి డిమ్రి, బాబీ దేవోల్‌ కీలకపాత్రలు పోషించారు. అనిల్‌ కపూర్‌ తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లు వసూలుచేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీనికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ రానుందని సందీప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని