‘ఆహా’లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా సెప్టెంబరు 17వ తేదీ నుంచి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ స్ట్రీమింగ్‌ అవుతుందని కథానాయకుడు సుశాంత్‌ తెలిపాడు.

Published : 08 Sep 2021 17:18 IST

హైదరాబాద్‌: సుశాంత్‌ కథానాయకుడిగా ఎస్‌.దర్శన్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా థ్రిల్లర్‌ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి కథానాయిక. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరలు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ.. రొమాన్స్‌.. యాక్షన్‌.. థ్రిల్లింగ్‌.. ఇలా అన్ని అంశాల‌ను స‌మ‌పాళ్లలో మేళ‌విస్తూ ద‌ర్శకుడు ఈ కథను తీర్చిద్దిన విధానం మెప్పించింది. కాగా, ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా సెప్టెంబరు 17వ తేదీ నుంచి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ స్ట్రీమింగ్‌ అవుతుందని కథానాయకుడు సుశాంత్‌ తెలిపాడు.

ఈ చిత్రం కథేంటంటే: అరుణ్ (సుశాంత్) ఓ మ‌ధ్యత‌ర‌గ‌తి కుర్రాడు. డిజైన్ స్టూడియో అనే కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా ప‌ని చేస్తుంటాడు. అదే కంపెనీలో ఆర్కిటెక్ట్ ఇంట‌ర్న్ కోసం జాయిన్ అవుతుంది మీనాక్షి (మీనాక్షి చౌద‌రి). ఇద్దరూ తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతారు.  మీనాక్షిని క‌లిసేందుకు బైక్‌పై వెళ్లిన అరుణ్ ఎలా ఇబ్బందులు పడ్డాడు? అసలు అతనికి ఎదురైన సమస్య ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది చిత్ర కథ. క‌థా నేప‌థ్యం, సుశాంత్‌ నటన, ద్వితీయార్ధం సినిమా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని