Ileana: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్
ప్రముఖ హీరోయిన్ ఇలియానా(Ileana) ఆసుపత్రిలో చేరింది. మంచి వైద్యం అందిస్తున్నారని పేర్కొంది.
హైదరాబాద్: ‘దేవదాసు’(Devadasu) సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి ‘పోకిరి’(Pokiri) సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది ఇలియానా(Ileana). ఆ తర్వాత తెలుగులో అగ్రహీరోల సరసన వరస ఆఫర్లు దక్కించుకుంది. అటు బాలీవుడ్‌లోనూ సినిమాలతో మెప్పిస్తోంది ఈ గోవా బ్యూటీ. తాజాగా ఇలియానా అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను షేర్ చేసిన ఆమె. తనకు సకాలంలో మంచి వైద్యం అందించారని పేర్కొంది.
ఇక తన హెల్త్ అప్‌డేట్‌ను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.‘‘ఒక రోజులో చాలా మార్పు వచ్చింది. డాక్టర్లు సెలైన్స్ పెట్టారు. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చాలా మంది నాకు మెసేజ్‌లు పంపుతున్నారు. మీకు నా కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమను పొందుతున్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. డాక్టర్లు సరైన సమయంలో మంచి వైద్యం అందించారు’’ అని రాసింది. ఇది చూసిన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించిన ఇలియానా చివరిసారి ‘ది బిగ్ బుల్’(The BigBull) అనే హిందీ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’(Unfair&Lovely) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు నిందితుడి ఎన్కౌంటర్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!